Breaking News
Home / Film News / తమిళ హీరోని డిన్నర్ కి ఆహ్వానించిన అఖిల్…

తమిళ హీరోని డిన్నర్ కి ఆహ్వానించిన అఖిల్…

ఫిల్మ్ న్యూస్: వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తన నాలుగవ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే . ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బేనర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. గోపి సుందర్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తమిళ హీరో శివకార్తికేయన్‌, దర్శకుడు మిత్రన్, జార్జిలని హైదరాబాద్‌లో తన ఇంటికి డిన్నర్‌కి అఖిల్‌ ఆహ్వానించాడు. ఆ తర్వాత కలిసి ఫోటోలు దిగారు. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *