Breaking News
Home / Film News / అల వైకుంఠపురములో టీజర్ రిలీజ్…

అల వైకుంఠపురములో టీజర్ రిలీజ్…

ఫిల్మ్ న్యూస్ : త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ‘అల వైకుంఠపురములో’ చిత్రం రూపొందింది. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ నుంచి తాజాగా ఒక టీజర్ ను రిలీజ్ చేశారు. ప్రధాన పాత్రల కాంబినేషన్లోని సన్నివేశాలపై ఈ టీజర్ ను కట్ చేశారు. క్లాస్ లుక్ తోను .. మాస్ లుక్ తోను బన్నీ డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు.

క్లాస్ లుక్ తో బన్నీ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. లవ్ .. కామెడీ .. యాక్షన్ సీన్స్ పై కట్ చేసిన ఈ టీజర్ ఆకట్టుకునేలా వుంది. పూజా హెగ్డే ఆఫీస్ లోనే బన్నీ పనిచేస్తాడనే క్లారిటీ అయితే ఈ టీజర్ తో వచ్చేసింది. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో ‘టబు’ కనిపించనుంది. ఆమె పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *