విజయవాడ: కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో అక్రమ మద్యం భారీగా పట్టుబడింది. పెనుగంచిప్రోలులోని మున్నేరు నది బ్రిడ్జి వద్ద అక్రమంగా తరలిస్తున్న 2,500 మద్యం బాటిళ్లను మినీ లారీలో డ్రమ్ములలో పెట్టుకొని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. మద్యం విలువ సుమారు 3లక్షలు ఉండవచ్చని అధికారులు వెల్లడించారు.
