Breaking News
Home / Crime / ఘర్షణకు దారి తీసిన ఎమ్మార్పీ రేటు….

ఘర్షణకు దారి తీసిన ఎమ్మార్పీ రేటు….

మహబూబాబాద్‌: మంగళవారం రాత్రి రవి అనే వ్యక్తి మద్యం కొనేందుకు జిల్లాలోని గూడూరు జాతీయ రహదారికి కూతవేటు దూరంలో ఉన్న ఓ మద్యం దుకాణం వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో బ్రాందీ సీసాను కొనుగోలు చేసి ఎమ్మార్పీ ప్రకారం 120 రూపాయలు చెల్లించాడు. అయితే ఎమ్మార్పీపై పది రూపాయలు అదనంగా ఇవ్వాలని మద్యం దుకాణం సిబ్బంది బాలు, రవిని డిమాండ్‌ చేశారు. తాను అదనంగా ఒక్క రూపాయి కూడా చెల్లించనని రవి తేల్చి చెప్పడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగి ఘర్షణకు దారి తీసింది. దీంతో సహనం కోల్పోయిన బాలు రవిపై మద్యం సీసాతో విచక్షణా రహితంగా దాడి చేశారు. విషయం గమనించిన స్థానికులు రవిని ఆస్పత్రితో చేర్పించగా ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *