Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / రేపటి నుంచి 3,500 షాపుల్లో మద్యం అమ్మకాలు: ఎక్సైజ్‌శాఖ

రేపటి నుంచి 3,500 షాపుల్లో మద్యం అమ్మకాలు: ఎక్సైజ్‌శాఖ

అమరావతి: రేపటి నుంచి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మద్యం వ్యాపారం చేయనున్నట్లు ఎక్సైజ్‌శాఖ పేర్కొంది. మొత్తం 3,500 షాపుల్లో మద్యం అమ్మకాలు చేపట్టనున్నట్లు ఎక్సైజ్‌శాఖవిడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల మద్యం షాపులు తెరిచి ఉంటాయని వెల్లడించారు. అయితే కొత్త మద్యం విధానంతో మద్యం షాపుల సంఖ్య బాగా తగ్గినట్లు పేర్కొన్నారు. దీనికి ముందు 4,380 ఉన్న షాపులు ప్రస్తుతం 3,500కి తగ్గాయని, అంతే కాకుండా మద్యం అమ్మకాలు కూడా 15 శాతం మేర తగ్గినట్లు వెల్లడించారు. పర్మిట్ రూమ్ విధానం తొలగించామని, బెల్ట్ షాపులను పూర్తిగా తొలగించామని ఎక్సైజ్‌శాఖ తెలిపింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *