Breaking News
Home / States / వ్యాపారస్తులందరూ బంద్‌ను పాటించాలి…

వ్యాపారస్తులందరూ బంద్‌ను పాటించాలి…

హైదరాబాద్: తెలంగాణ ప్రజలందరూ రేపటి బంద్‌ను విజయవంతం చేయాలని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం పిలుపునిచ్చారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు చాలా ప్రాముఖ్యత ఉందన్నారు. వ్యాపారస్తులందరూ రేపటి బంద్‌ను పాటించాలని కోరుతున్నామన్నారు. సమ్మెను విజయవంతం చేసుకోవడం తెలంగాణ ప్రజలందరికీ అవసరమని తెలిపారు. సకలజనుల సమ్మెలో ఏయే వర్గాలకు ఏ వాగ్ధానాలు చేశామో అందరూ గుర్తు చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ మొండి వైఖరి వల్ల తెలంగాణలో రాజ్యాంగ సంక్షోభం వచ్చే ప్రమాదముందన్నారు. టీఆర్ఎస్ నాయకులు కూడా మాతో టచ్‌లో ఉన్నారని తెలిపారు. రాజ్యాంగ సంక్షోభం రావొద్దని మేం ప్రయత్నిస్తోంటే… ప్రభుత్వం మాత్రం వినటం లేదన్నారు. కేసీఆర్ మొండివైఖరి వీడాలన్నారు. రాజ్యాంగ సంక్షోభం తలెత్తితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. దానికి కేసీఆరే బాధ్యత వహించాలని సూచించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *