మదనపల్లి: అనారోగ్యంగా ఉన్న తమ కుమార్తెకు చికిత్స చేయించే ఆర్థిక స్థోమత లేదని, అందువల్ల పాప కారుణ్య మరణానికి అనుమతించాలని మదనపల్లికి చెందిన ఓ కుటుంబం కోర్టును ఆశ్రయించింది. ఏడాది వయసున్న తమ కుమార్తె సుహానాకు ఏడాది కాలంగా షుగర్ లెవెల్స్ తక్కువ కావడం వల్ల పలు ఆసుపత్రుల్లో చికిత్స చేయించామని, అయినా జబ్బు నయం కాలేదని వారు చెబుతున్నారు. ఈ మేరకు మదనపల్లి కోర్టులో వినతిపత్రం సమర్పించారు.
చికిత్స కోసం సుమారు రూ.12లక్షల వరకు ఖర్చు చేసినట్లు వారు తెలిపారు. ఉన్న ఆస్తి, నగలు అమ్మేసి ఇప్పటి వరకు చికిత్స అందించామని అయినా పాపకు జబ్బు నయం కాకపోవడంతో ఇకపై డబ్బు ఖర్చు చేసే స్థోమత లేక తమ కుమార్తెకు కారుణ్య మరణం ప్రసాదించాలని వారు వినతిపత్రంలో పేర్కొన్నారు.