Breaking News
Home / Lifestyle / Recipes / ఆలూ టిక్కీ

ఆలూ టిక్కీ

కావలసిన పదార్థాలు
బంగాళదుంపలు – 5, బ్రెడ్‌ క్రష్‌ – అరకప్పు, ఉప్పు – రుచికి సరిపడా, కారం – అరటీ స్పూను, పచ్చిమిర్చి తరుగు – అరటీ స్పూను, కొత్తిమీర తరుగు – అరకప్పు, నూనె – వేగించడానికి సరిపడా.

తయారుచేసే విధానం
ముందుగా బంగాళదుంపల్ని ఉడికించి తొక్కతీసి మెత్తగా చిదమాలి. అందులో బ్రెడ్‌ క్రష్‌, ఉప్పు, కారం, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగు, వేసి ముద్దగా చేసుకోవాలి. పది నిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచి మిశ్రమం కొంత గట్టిపడ్డాక సమభాగాలుగా చేయాలి. చేతులకు నూనె రాసుకుని టీక్కీలుగా ఒత్తి పెనంపై నూనెలో రెండు వైపులా దోరగా వేగించాలి. ఈ టిక్కీలు చీల్లీసాస్‌, లేదా టమోటా సాస్‌తో తింటే బాగుంటాయి.

Check Also

రుచికరంగా ‘ఫ్రీడమ్‌ కుకరీక్లాస్‌ -8’

Share this on WhatsAppమాస్టర్‌ చెఫ్‌ ఇండియా సీజన్‌-2 ఫైనలిస్ట్‌, మాస్టర్‌ చెఫ్‌ పునీతమెహతా ఆధ్వర్యంలో ఫ్రీడం సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *