కరోనా వైరస్ సంక్షోభంలోనూ పనిచేస్తున్న ముందు వరుస ఉద్యోగులకు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ శుభవార్త చెప్పింది. ముందు వరుస ఉద్యోగులకు ఏకకాల బోనస్‌లు అందజేస్తామని ప్రకటించింది. ఇందుకోసం 500 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.3,775 కోట్లు) ఖర్చు చేస్తున్నట్టు తెలిపింది. జూన్ వరకు పనిచేసిన ఉద్యోగులు, భాగస్వాములు ఏకకాల బోనస్‌గా ఒక్కొక్కరికి 150 డాలర్లు (రూ.11,300) నుంచి 3000 డాలర్లు (రూ.2.26 లక్షలు) అందజేస్తామని అమెజాన్ వెల్లడించింది. అమెజాన్ ప్రకటనతో ఉద్యోగుల్లో ఆశలు చిగురించాయి. కరోనా కష్టకాలంలో అండగా నిలుస్తున్న అమెజాన్ సంస్థ నిర్ణయంపై సదరు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
