ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ దీపావళి సందర్భంగా ఏర్పాటు చేసిన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సెలబ్రేషన్ స్పెషల్ సేల్ ఇవాళ ప్రైమ్ మెంబర్లకు అందుబాటులోకి వచ్చింది. రేపటి నుంచి అసలు సేల్ ప్రారంభం కానుండగా ప్రైమ్ మెంబర్లకు మాత్రం ఇప్పటికే సేల్‌ను ప్రారంభించారు. ఈ క్రమంలో ఈ సేల్ ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగనుండగా ఇందులో అనేక ఉత్పత్తులపై ఆకట్టుకునే ఆఫర్లు, రాయితీలను అందిస్తున్నారు. సేల్‌లో భాగంగా వన్‌ప్లస్ 7 ప్రొ, హువావే మేట్ 20 ప్రొ, ఆపిల్ ఐఫోన్ ఎక్స్ఆర్, వన్‌ప్లస్ 7, ఒప్పో రెనో, ఎల్జీ వీ40 థిన్‌క్యూ, జీ7 థిన్‌క్యూ, పోకో ఎఫ్1, ఒప్పో కె3, వివో వి15, ఎంఐ ఎ3, శాంసంగ్ గెలాక్సీ ఎం30, నోకియా 6.1 ప్లస్, ఎంఐ ఎ2, ఎల్జీ డబ్ల్యూ30, రెడ్మీ 7ఎ తదితర ఫోన్లతోపాటు గేమింగ్ ల్యాప్‌టాప్‌లు, హార్డ్‌డిస్క్‌లు, ఎస్ఎస్డీలు, టీవీలు, యాక్ససరీలు తదితర అనేక ప్రొడక్ట్స్‌పై తగ్గింపు ధరలను అందిస్తున్నారు.
