Breaking News
Home / Lifestyle / Business / అమెజాన్ వినియోగదారులకు శుభవార్త

అమెజాన్ వినియోగదారులకు శుభవార్త

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తమ వినియోగదారులకు శుభవార్త తెలిపింది. ప్రైమ్ డే 2019 సేల్ పేరుతో మరో కొత్త ఆఫర్ ప్రకటించింది. జూలై నెల 15, 16వ తేదీల్లో ప్రైమ్ డే సేల్‌ పేరుతో కొత్త ఉత్పత్తులు, ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్ ఇస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ఆఫర్ 48 గంటల వరకు ఉంటుందని, ప్రైమ్ వీడియో అండ్ ప్రైమ్ మ్యూజిక్‌తోపాటు మరికొత్త ఎలక్ట్రానిక్ వస్తువులపై ఆఫర్ అందుబాటులో ఉంటుంది. గత సంవత్సరం కూడా 36 గంటలపాటు ఇదే తరహా ఆఫర్ కంపెనీ ప్రకటించింది. కొత్త ఉత్పత్తులను కొనుగోలు చేసిన హెచ్‌డీఎఫ్‌సీ తాఖాదారులకు 10 శాతం తక్షణ డిస్కౌంట్ లభించనుంది. ఈ సంవత్సరంలో 1,000 ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ పేర్కొంది. వన్‌ ప్లస్‌ వన్‌, అమెజాన్ బెసిక్స్, శాంసంగ్, ఇంటెల్ సంస్థల ఉత్పత్తులపై భారీ ఆఫర్ ప్రకటించింది.

Check Also

మరోసారి వార్తల్లో నిత్యానంద

Share this on WhatsAppఅహ్మదాబాద్: నిత్యానంద నిర్వహణలో ఉన్న స్కూల్లో తమ ఇద్దరు కూతుళ్లను నిర్భంధించారని..వారిని విడిపించాలంటూ గుజరాత్ హైకోర్టులో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *