Breaking News
Home / States / Andhra Pradesh / ఐటీడీఏ పీఓగా అంబేద్కర్ బాధ్యతలు స్వీకరణ…

ఐటీడీఏ పీఓగా అంబేద్కర్ బాధ్యతలు స్వీకరణ…

విజయనగరం: విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇస్తానని, ఆయా సంస్థల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి వాటిని క్రమంగా మెరుగు పరుస్తానని పార్వతీపురం ఐటీడీఏ పీఓ అంబేద్కర్‌ తెలిపారు. బుధవారం స్థానిక ఐటీడీఏలో అంబేద్కర్‌ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌ మాట్లాడుతూ.. గతంలో ఇక్కడ ఏడాదిన్నర పని చేశానని, ఇక్కడ పరిస్థితులపై అవగాహన ఉందని, ప్రస్తుత పరిస్థితులు తెలుసుకొని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలను, ఇతర సంక్షేమ కార్యక్రమాలను ప్రతి గిరిజనుడికి అందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *