Breaking News
Home / hyderabad / మంచి రాజ్యాంగాన్ని అందించిన వ్యక్తి అంబేడ్కర్‌

మంచి రాజ్యాంగాన్ని అందించిన వ్యక్తి అంబేడ్కర్‌

తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్‌

హైదరాబాద్‌: ఎన్ని ఆటంకాలు ఎదురైనా దేశానికి మంచి రాజ్యాంగాన్ని అందించిన వ్యక్తి అంబేడ్కర్‌ అని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరామ్‌ అన్నారు. అంబేడ్కర్‌ 64వ వర్ధంతి సందర్భంగా ట్యాంక్‌ బండ్‌పై ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాజకీయ విప్లవానికి పునాదులు వేయడమే కాకుండా సమాజంలో అసమానతలు రూపుమాపడంతో పాటు ప్రభుత్వ రాయితీలను, మనుషుల మధ్య సమానత్వానికి కృషి చేశారని పేర్కొన్నారు. కానీ పాలకులు మాత్రం మనుషుల మధ్య వ్యత్యాసాలు చూపిస్తున్నారని ఆవేదన చెందారు. అందరికీ ఒకే విధంగా న్యాయం చేయాలని కోరారు. దీని కోసం తమ పార్టీ అహర్నిశలు కృషి చేస్తుందని కోదండరాం పేర్కొన్నారు.

Check Also

నేటి నుంచి స్వచ్ఛంద లాక్‌డౌన్‌

Share this on WhatsAppఆదిలాబాద్: కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా వాంకిడి మండల కేంద్రంలో గురువారం నుంచి వారం రోజుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *