Breaking News
Home / National / డిసెంబర్ వరకు అమిత్ షానే బాస్?

డిసెంబర్ వరకు అమిత్ షానే బాస్?

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో భారీ మెజారిటీ విజయం నమోదు చేసిన నాటి నుంచి బీజేపీ ఫుల్ జోష్‌లో మునిగితేలుతోంది. బీజేపీ చీఫ్ అమిత్ షా కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో.. ఇప్పుడు ఆ పార్టీకి నూతన సారథి ఎవరన్న దానిపై విశేష ఆసక్తి నెలకొంది. అయితే ఈ ఏడాది డిసెంబర్ వరకు పార్టీ అధ్యక్షుడిగా ఆయనే కొనసాగనున్నట్టు తాజాగా వార్తలు వెలువడుతున్నాయి. ప్రముఖ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం… పార్టీ సంస్థాగత ఎన్నికలు ముగిసే వరకు ఆయన అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. ఈ ఎన్నికలు డిసెంబర్ నాటికి ముగుస్తాయని భావిస్తున్నారు. సంస్థాగత ఎన్నికల షెడ్యూల్‌పై రేపు జరిగే ఆఫీస్ బేరర్ల సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.

పార్టీ జాతీయ స్థాయి ఆఫీస్ బేరర్లు, రాష్ట్రాల విభాగాల అధ్యక్షులు, రాష్ట్రాల ఇంచార్జిలతో సమావేశమైన అనంతరం అమిత్ షా.. సంస్థాగత ఎన్నికల ప్రక్రియపై నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. అమిత్ షా వారసుడిని ఎన్నుకోవడంతో ఈ ప్రక్రియ ముగిసే అవకాశాలున్నాయి. ఈసారి పార్టీ నూతన అధ్యక్షుడితో పాటు ఓ వర్కింగ్ ప్రెసిడెంట్‌ను కూడా నియమించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. సంస్థాగత ఎన్నికలను పర్యవేక్షించే బాధ్యతలను వర్కింగ్ ప్రెసిడెంట్‌కి అప్పగించవచ్చునని వినిపిస్తోంది.

Check Also

మంగల్‌ పాండే వివాదాస్పద వ్యాఖ్యలు

Share this on WhatsAppపట్నా: బీహార్ లో మెదడువాపు వ్యాధి బారిన పడి 103 మంది చిన్నారు మృతి చెందిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *