Breaking News
Home / National / వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు అమిత్‌షా పచ్చజెండా

వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు అమిత్‌షా పచ్చజెండా

న్యూఢిల్లీ : న్యూఢిల్లీ రైల్వేస్టేషనులో గురువారం కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా వందేభారత్ ఎక్స్‌ప్రెస్ కు పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. ఢిల్లీ నుంచి కట్రా స్టేషను వరకు నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును అమిత్ షా గురువారం ఉదయం 9 గంటలకు న్యూఢిల్లీ రైల్వేస్టేషను నుంచి ప్రారంభించనున్నారు. గత నెలలోనే ఢిల్లీ- కట్రా మార్గంలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ట్రయల్ రన్ పూర్తి చేశామని రైల్వేబోర్డు ఛైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ చెప్పారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా యాత్రికులకు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ బహుమతిగా ఇస్తున్నామని రైల్వేబోర్డు ఛైర్మన్ పేర్కొన్నారు. దేశంలో రద్దీగా ఉన్న ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-హౌరా రైలుమార్గాల్లోనూ డిసెంబరుకల్లా వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుపుతామని ఆయన తెలిపారు. మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా దేశంలో 2022 కల్లా 40 వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడపాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వినోద్ కుమార్ వివరించారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *