Breaking News
Home / National / రేపు కోల్‌కతాలో పర్యటించనున్న అమిత్ షా…

రేపు కోల్‌కతాలో పర్యటించనున్న అమిత్ షా…

కోల్‌కతా: అసోంలో ఎన్ఆర్‌సీ తర్వాత పశ్చిమబెంగాల్‌లో దీన్ని అమలు చేయాలని కేంద్ర పట్టుదలగా ఉందని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పదేపదే విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా మంగళవారం నాడు కోల్‌కతాలో పర్యటించనున్నారు. షెడ్యూల్ ప్రకారం ఆయన ఉదయం కోల్‌కతా చేరుకుని సాల్ట్ లేక్‌లోని బీజే బ్లాక్‌లో దుర్గా పూజా మండపాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు నేతాజీ ఇండోర్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో ప్రసంగిస్తారు. అసోం ఒప్పందం ప్రకారం జరిగిన ఎన్‌ఆరీసీకి, ఇతర రాష్ట్రాల్లో చేపట్టే ఎన్ఆర్‌సీకి తేడా ఉంటుందని అమిత్‌షా ఈ సందర్భంగా చెప్పే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న హిందువులు, జైనులు, సిక్కులు, క్రిస్టియన్లు, బౌద్ధ మతస్థులు ఎలాంటి ఆందోళన పడాల్సిన పని లేదని, 2014 డిసెంబర్ 31కి ముందు పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారికి సీఏబీ కింద తొలుత పౌరసత్వం మంజూరు చేసి, ఆ తర్వాతే ఎన్‌ఆర్‌సీ అమలు చేస్తారని అమిత్‌షా చెప్పే అవకాశం ఉందని అంటున్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *