Breaking News
Home / National / ఆ కుటుంబానికి ఎస్పీజీ భద్రతపై అమిత్ షా వ్యాఖ్యలు….

ఆ కుటుంబానికి ఎస్పీజీ భద్రతపై అమిత్ షా వ్యాఖ్యలు….

న్యూఢిల్లీ: గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రత కల్పించాలనే డిమాండ్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు లేని భద్రత ఒక కుటుంబానికి ఎలా ఇస్తారని అన్నారు. ఎస్పీజీ భద్రత ప్రధానమంత్రికి ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. దేశంలోని అందరి భద్రత గురించి తాము ఆలోచిస్తామని, ఒక కుటుంబం గురించి కాదని గాంధీ కుటుంబంపై అమిత్ షా విమర్శలు గుప్పించారు.

మాజీ ప్రధానులకు ఎస్పీజీ భద్రత తొలగించిన ఘనత కాంగ్రెస్‌దేనని అమిత్ షా అన్నారు. తాము కుటుంబానికి వ్యతిరేకం కాదని వారసత్వానికి వ్యతిరేకమని అమిత్ షా అన్నారు. గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రత కల్పించాలనడం మధ్యయుగం నాటి ఆలోచనా పరులని, ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి తావు లేదని అమిత్ షా అన్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *