Breaking News
Home / National / పౌరసత్వ బిల్లుపై అమిత్ షా వ్యాఖ్యలు…

పౌరసత్వ బిల్లుపై అమిత్ షా వ్యాఖ్యలు…

న్యూఢిల్లీ: అక్రమంగా వలస వచ్చిన ముస్లింలను పౌరసత్వ సవరణ బిల్లు (క్యాబ్)లో ఎందుకు చేర్చలేదంటూ ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పారు. ఈ బిల్లులో ఉన్న మూడు పొరుగు దేశాలూ ముస్లిం దేశాలేననీ.. అక్కడ ముస్లింలకు వచ్చిన ఇబ్బందేమీ లేదని ఆయన పేర్కొన్నారు. ‘‘మూడు పొరుగు దేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుంచి వచ్చిన మైనారిటీలను ఈ బిల్లులో చేర్చడం జరిగింది.  ఈ దేశాల్లో ముస్లింలు పీడనకు గురయ్యే అవకాశాలు చాలా తక్కువ. అందుకే ఈ దేశాల్లో అణచివేతకు గురైన హిందువులు, క్రైస్తవులు, పార్సీలు, జైనులు, బౌద్ధులు, సిక్కులకు ఈ బిల్లు ద్వారా భారత పౌరసత్వం ఇచ్చేందుకు ప్రతిపాదించడం జరిగింది..’’ అని అమిత్ షా పేర్కొన్నారు. శ్రీలంక నుంచి వస్తున్న తమిళుల సమస్యలను పరిష్కరించేందుకు గతంలోనే ఓ చట్టం వచ్చిందనీ.. అందుకే ఇప్పుడు ఆ దేశం తప్ప మిగతా మూడు దేశాల నుంచి వస్తున్న వారికోసం తాజా బిల్లును తీసుకొచ్చామన్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *