Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / జగన్‌కు అమిత్‌షా రెండో‘సారీ’ !

జగన్‌కు అమిత్‌షా రెండో‘సారీ’ !

అమరావతి: కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఏపీ సీఎం జగన్‌ అపాయింట్‌మెంట్‌ రద్దయింది. మహారాష్ట్రలో నామినేషన్లు ముగిసేవరకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం కుదరదని అమిత్‌షా స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే.. ఇటీవల కాలంలో జగన్‌కు అమిత్‌షా అపాయింట్‌మెంట్‌ వరుసగా రెండోసారి రద్దవడం గమనార్హం. జగన్‌ రాక కోసం ఢిల్లీలోని ఏపీ భవన్‌ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

అయితే.. అమిత్‌ షా మహారాష్ట్ర పర్యటన కారణంగా ఢిల్లీలో అందుబాటులో ఉండడం లేదు. దీంతో సీఎం ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నట్టు ఏపీ భవన్‌ అధికార వర్గాలు వెల్లడించాయి. ఇటీవల సీఎం జగన్ ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. అనంతరం అమిత్‌ షాను కలిసేందుకు ప్రయత్నించినా ఆ రోజు కూడా అపాయింట్‌మెంట్‌ లభించక వెనుదిరిగారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *