Breaking News
Home / Film News / అత్యాచారాలపై అమితాబ్ సంచలన వ్యాఖ్యలు

అత్యాచారాలపై అమితాబ్ సంచలన వ్యాఖ్యలు

దిశా ఘటనపై దేశమంతా కోపోద్రుక్తంతో ఊగిపోతోంది.నిందితులకు కఠిన శిక్షలు పడాలని యావత్ దేశం సోషల్ మీడియా వేదికగా ముక్త కంఠంతో చెప్తుంటే కొంత మంది మాత్రం నిందుతులకు సప్పోర్ట్ చేస్తూ అమ్మాయిలదే తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్నారు.ఇప్పుడు ఇలా మాట్లాడే వారిపైన చర్చలు జరుగుతున్నాయి.ఆలా కామెంట్స్ చేసే వారు కూడా రేపిస్టులేనని అలంటి వారిని అరెస్ట్ చేసి కౌన్సిలింగ్ ఇవ్వాలని కోరుతున్నారు.ఆలా కామెంట్స్ చేసిన కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేసారు.అయితే తాజాగా అమ్మాయిల అత్యాచారాలపై అమితాబ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 1990లో విడుదలైన మూవీ అనే మ్యాగజైన్‌ కవర్‌ పేజ్‌ మీద ఓ వార్తను పబ్లిష్ చేశారు. అత్యాచారం తప్పదనప్పుడు.. వెనక్కి పడుకొని దాన్ని ఎంజాయ్‌ చేయటమే అంటూ అమితాబ్‌ చేసిన వ్యాఖ్యలు ఆయన్ను ఇబ్బందులు పాలు చేయనున్నాయా? అన్నది ఆ వార్త సారాంశం. అయితే అప్పట్లో ఈ వ్యాఖ్యలు ఎలాంటి ప్రకంపనలు సృష్టించాయో తెలియదుగానీ.. ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో అమితాబ్‌ చేసిన ఆ కామెంట్‌ వైరల్‌ అవుతోంది.

అప్పట్లో యాంగ్రీ యంగ్ మెన్‌గా బాలీవుడ్‌ను ఏలేతున్న అమితాబ్‌ చేసిన కామెంట్స్‌. ఇన్నేళ్ల తరువాత కూడా ఆయన్ను వెంటాడుతున్నాయి. తాజాగా దిశ ఘటన తరువాత అమితాబ్‌ వ్యాఖ్యలను తెర మీదకు తీసుకువచ్చిన కొంత మంది నెటిజెన్లు, బాలీవుడ్ సూపర్‌ స్టార్లే ఇలా మాట్లాడుతుంటే ఇక రక్షణ ఎక్కడ ఉంటుంది అని వ్యాఖ్యానిస్తున్నారు.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *