Breaking News
Home / National / కాంగ్రెస్ నేతపై అమిత్ షా విమర్శలు…

కాంగ్రెస్ నేతపై అమిత్ షా విమర్శలు…

చండీగఢ్‌: రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా విమర్శలు గుప్పించారు. హర్యానా, మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతుంటే.. ఆయన సెలవుల్లో ఉన్నారంటూ రాహుల్‌ విదేశీ పర్యటనుద్దేశించి ఎద్దేవా చేశారు. హర్యానా ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్‌తో పాటు, కాంగ్రెస్‌ పార్టీని అమిత్ షా విమర్శించారు.

తలాక్‌ బిల్లు, సర్జికల్‌ దాడులు, వైమానిక దాడులు, ఆర్టికల్‌ 370 రద్దు.. ఇలా ప్రతి అంశాన్ని కాంగ్రెస్‌ పార్టీ విమర్శించిందని గుర్తుచేశారు. ఆర్టికల్‌ 370 రద్దుకు మద్దతిస్తున్నారా? లేదా? చెప్పాలని రాహుల్‌ను డిమాండ్‌ చేశారు. వారసత్వ రాజకీయాలతో కాంగ్రెస్‌ పార్టీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని దుయ్యబట్టారు.

Check Also

కాంగ్రెస్ నీరసించిపోలేదు…

Share this on WhatsAppముంబై : కీలకమైన అసెంబ్లీ ఎన్నికల యుద్ధం నుంచి కాంగ్రెస్ పారిపోయిందన్న విమర్శలపై ఆ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *