Breaking News
Home / Lifestyle / Recipes / ఆమ్లా లడ్డూ

ఆమ్లా లడ్డూ

కావలసినవి
ఉసిరికాయలు – ఒక కిలో, చక్కెర – ఒక కిలో.
తయారీవిధానం
ఉసిరికాయలను నీళ్లల్లో బాగా కడిగి ప్రెషర్‌కుక్కలో వేసి ఉడికించాలి. ఉడికించిన ఉసిరికాయలు పూర్తిగా చల్లారిన తర్వాత సన్నని ముక్కలుగా చేసి మిక్సీ వేయాలి. పాన్‌ తీసుకుని అందులో ఉసిరికాయ తరుగు, పంచదార వేసి ఆ మిశ్రమం చిక్కబడే వరకూ గరిటెతో ఆపకుండా కలుపుతుండాలి. చిక్కబడిన ఈ మిశ్రమాన్ని స్టవ్‌ మీద నుంచి దించి చల్లారనివ్వాలి. చల్లారిన ఈ మిశ్రమాన్ని ఒకే పరిమాణంలో గుండ్రంగా ఒత్తితే ఉసిరి లడ్డూ రెడీ. వీటిని పిల్లలు ఇష్టంగా తింటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *