విజయవాడ: దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా నాలుగోరోజు విజయవాడ ఇంద్రకీలాద్రి పైకి భక్తులు పోటెత్తారు. దర్శనం కోసం నాలుగు గంటల పాటు భక్తులు క్యూలైన్లో ఉండాల్సి వస్తోంది. అయితే వీఐపీల పేరుతో ఇష్టానుసారం అమ్మవారి దర్శనానికి పంపిస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో అధికారులు లఘు దర్శనం ఏర్పాటు చేశారు.
