Breaking News
Home / States / అస్పష్టమైన పాలన సాగుతోంది…

అస్పష్టమైన పాలన సాగుతోంది…

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం నియంతృత్వం వల్ల ఒక అస్పష్టమైన పాలన సాగుతోందని టీటీడీపీ నేత ఎల్ రమణ విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… కమీషన్‌లకు కక్కుర్తిపడి అడ్డగోలుగా డబ్బులు ఖర్చు పెడుతున్నారని, రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడి తప్పాయని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు, మహిళల మీద అఘాయిత్యాలు పెరుగుతున్నాయన్నారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని, నిత్యావసర ధరలు పెరిగి రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. అసెంబ్లీ సమావేశాలు పెడితే ప్రతిపక్షాలు పరిష్కారం చూపెట్టే అవకాశం ఉంటుందని రమణ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *