ఇస్లామాబాద్: పాకిస్థాన్ కు చెందిన ఓ స్థానిక దినపత్రిక నేడు ప్రచురించిన కథనం తీవ్ర కలకలం రేపుతోంది. యూఎన్జీఏ సమావేశాల నిమిత్తం అమెరికాకు వెళ్లడానికి ఇమ్రాన్ ఖాన్ కు సౌదీ రాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఓ అత్యాధునిక ప్రైవేట్ జెట్ ను సమకూర్చారు. అందులోనే ఇమ్రాన్ అమెరికా వెళ్లి, తిరిగి ఇస్లామాబాద్ కు వెళ్లిపోయారు. ఇప్పుడా విమానాన్ని వెంటనే వెనక్కు తిరిగి ఇచ్చేయాలని సౌదీ రాజు కోరినట్టు సదరు పత్రిక ప్రచురించింది. యూఎన్జీయే సమావేశాల్లో ఇమ్రాన్ వైఖరి సౌదీ రాజుకు నచ్చలేదని కూడా వెల్లడించింది. ఇప్పుడీ కథనంపై పాక్ లో చర్చ సాగుతుండగా, ప్రభుత్వ ప్రతినిధులు మాత్రం ఈ వార్త అవాస్తవమని ఖండిస్తున్నారు. ఇది నిరాధార కథనమని, సౌదీ అరేబియాతో పాక్ కు సత్సంబంధాలున్నాయని అంటున్నారు.
