Breaking News
Home / States / 19 నుండి క్యాబ్‌ డ్రైవర్ల నిరవధిక సమ్మె…

19 నుండి క్యాబ్‌ డ్రైవర్ల నిరవధిక సమ్మె…

హైదరాబాద్‌: హైదరాబాదులోని క్యాబ్‌ డ్రైవర్లు ఈ నెల 19 నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నారు. ఈ సమ్మె లో ఓలా, ఉబెర్‌, ఐటీ కంపెనీలకు సేవలందిస్తున్న ఇతర క్యాబ్‌ డ్రైవర్లు పాల్గనబోతున్నారని తెలంగాణ ట్యాక్సీ, డ్రైవర్స్‌ జేఏసీ చైర్మన్‌ షేక్‌ సలావుద్దీన్‌ తెలిపారు. కిలోమీటరుకు కనీస రుసుమును రూ.22 చేయాలనే డిమాండ్‌తో సమ్మెను చేపట్టబోతున్నట్టు చెప్పారు. డ్రైవర్లకు కనీస వ్యాపార హామీని ఇవ్వాలని, ఐటీ కంపెనీలకు అనుసంధానంగా పని చేస్తున్నవారికి జీవో నెంబర్‌ 61,66 అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ట్యాక్సీ డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. డ్రైవర్లపై జరుగుతున్న దాడుల కేసులను పరిష్కరించేందుకు వినియోగదారుల కేవైసీని తప్పనిసరి చేయాలని డిమాండ్‌ చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *