Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / శాసనమండలిలో అనూహ్యమైన సంఘటన

శాసనమండలిలో అనూహ్యమైన సంఘటన

అమరావతి: అధికార, ప్రతిపక్ష నేతల మధ్య విమర్శలతో ఏపీ అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌గా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శాసనమండలిలో కరువు, అనావృష్టిపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు బొత్స స్పందించి కరువుపై అన్ని జిల్లాల నుంచి సమగ్ర నివేదికలను తెప్పిస్తున్నామని త్వరలోనే ఈ లెక్కలు తేలుతాయని మంత్రి చెప్పుకొచ్చారు. అయితే కారణాలు తెలీదు కానీ ఉన్నట్లుండి ఆయన సభలో నుంచి వాకౌట్ చేశారు. దీంతో అధికార, విపక్ష పార్టీల నేతలు ఖంగుతిన్నారు. ముఖ్యమైన అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో మంత్రి ఇలా వెళ్లిపోవడం ఏంటని శాసనమండలి సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఆ తరువాత చర్చపై సరైన సమాధానం రాకపోవడం, టీడీపీ శాసనమండలి సభ్యులు కూడా బయటకు వెళ్లిపోయారు.

Check Also

పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరిగింది…

Share this on WhatsAppతణుకు: ‘దిశ’ కేసు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడంతో పోలీస్‌ వ్యవస్థపై ప్రజలకు మరింత నమ్మకం పెరిగిందని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *