Breaking News
Home / Film News / ‘అనగనగా ఓ ప్రేమకథ’ ఫస్ట్‌లుక్‌ రేపే..!

‘అనగనగా ఓ ప్రేమకథ’ ఫస్ట్‌లుక్‌ రేపే..!

థౌజండ్‌ లైట్స్‌ మీడియా బ్యానర్‌పై ప్రతాప్‌ తాతంశెట్టిని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమా అనగనగా ఓ ప్రేమకథ. ఈ సినిమాతో ప్రముఖ ఎడిటర్‌ మార్తండ్‌ కే వెంకటేష్‌ మేనల్లుడు విరాజ్‌ కె అశ్విన్‌ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.

ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్‌ రేపు(శుక్రవారం) ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేయనున్నారు. మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్‌ చేతుల మీదుగా సెప్టెంబర్‌ 7 సాయంత్రం 4 గంటలకు చిత్ర ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

Check Also

విశాల్‌పై …..వరలక్ష్మి తీవ్ర విమర్శలు…?

Share this on WhatsAppమరో పది రోజుల్లో దక్షిణ భారత నటీనటుల (నడిగర్‌) సంఘం ఎన్నికల జరగనున్న నేపథ్యంలో నటుడు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *