Breaking News
Home / Lifestyle / Business / ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా తప్పుకుంటున్న ఆనంద్‌ మహీంద్రా

ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా తప్పుకుంటున్న ఆనంద్‌ మహీంద్రా

ముంబయి: ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా అండ్‌ మహీంద్రా ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా ఆ పదవి నుంచి తప్పుకుంటున్నారు. ఈ మేరకు మహీంద్రా గ్రూప్‌ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. ‘సెబీ మార్గదర్శకాల మేరకు 2020 ఏప్రిల్‌ 1 నుంచి ఆనంద్‌.. మహీంద్రా బోర్డు నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా ఉంటారు’ అని సంస్థ ఆ ప్రకటనలో తెలిపింది. కొత్త బాధ్యతల్లో ఆనంద్‌ సంస్థకు ఓ మార్గదర్శకుడిగా వ్యవహరించనున్నారు.

ఈ విషయాన్ని ఆనంద్‌ కూడా ధ్రువీకరించారు. ‘కంపెనీ సమర్థవంతమైన నిర్వహణ కోసం మా గ్రూప్‌ కట్టుబడి ఉంది. దాన్ని ప్రతిబింబించేలా మా నాయకత్వంలో మార్పులు జరిగాయని చెప్పేందుకు ఆనందంగా ఉంది. ఈ మార్పుల కోసం ఏడాది పాటు శ్రద్ధగా కఠినమైన కసరత్తు నిర్వహించిన బోర్డు, నామినేషన్‌ కమిటీకి నా కృతజ్ఞతలు’ అని ఆయన ట్వీట్‌ చేశారు.

ఇక మహీంద్రా అండ్‌ మహీంద్రా మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈవోగా పవన్‌ గొయెంకా తిరిగి బాధ్యతలు చేపట్టనున్నట్లు కంపెనీ ప్రకటించింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి 2021 ఏప్రిల్‌ 1 వరకు గొయెంకా ఈ పదవిలో కొనసాగనున్నారు. గొయెంకా పదవీ విరమణ తర్వాత అనిశ్‌ సిన్హా సీఈవో, ఎండీ బాధ్యతలు చేపడతారని కంపెనీ పేర్కొంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1న అనిశ్‌ సిన్హా డిప్యూటీ ఎండీ, సీఎఫ్‌వోగా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత సీఎఫ్‌వో పార్థసారథి కొత్త బాధ్యతల్లోకి వెళ్లనున్నారు. రానున్న 15 నెలల్లో సంస్థలోని కీలక పదవుల్లో ఉన్న వారు పదవీ విరమణ చేయనున్నట్లు తెలిపింది.

Check Also

భారత్‌లో వివో డిజైన్‌ సెంటర్‌

Share this on WhatsApp50,000కు పెరగనున్న ఉద్యోగుల సంఖ్య ప్రీమియం సెగ్మెంట్‌లో ఎక్స్‌50 స్మార్ట్‌ఫోన్ల ఆవిష్కరణ ధర రూ. 34,990 …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *