Breaking News
Home / States / Andhra Pradesh / Anantapur / గుత్తి క్వారెంటైన్‌లో ఉద్రిక్తత…పోలీసులపై దాడి

గుత్తి క్వారెంటైన్‌లో ఉద్రిక్తత…పోలీసులపై దాడి

గుత్తి: అనంతపురం జిల్లా గుత్తి ఎస్కేడి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారెంటైన్ సెంటర్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. 14 రోజుల పాటు క్వారెంటైన్‌ను పూర్తి చేసుకున్న తమను తమ స్వస్థలాలకు పంపించాలంటూ మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌ ప్రాంతాలకు చెందిన వలసకూలీలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తమను ఇళ్లకు పంపే వరకు భోజనం కూడా చేయమని క్వారంటైన్ సెంటర్ వద్ద ఆందోళన తెలిపారు. కాగా కలెక్టర్ నుంచి ఆదేశాలు వచ్చేంత వరకు పంపించడానికి వీలు కాదని పోలీసులువారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నం చేశారు. అయినా వారు వినకుండా పోలీసులపై చెప్పులతో, మట్టిగడ్డలతో, బండరాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో గుత్తి సీఐ సహా ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. ఎంత నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వలస కూలీలు వినకపోవడంతో పోలీసులు లాఠీఝుళిపించారు.

Check Also

నరసరావుపేటలో రేపటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్

Share this on WhatsAppనరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో శనివారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లు ఆర్డీవో ఎం.వెంకటేశ్వర్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *