Breaking News
Home / National / 49లోకి అడుగుపెట్టనున్న మాజీ కెప్టెన్ ‘జంబో’…

49లోకి అడుగుపెట్టనున్న మాజీ కెప్టెన్ ‘జంబో’…

బెంగళూరు: భారత మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే నేటితో 49లోకి ప్రవేశించనున్నాడు. అభిమానులు ముద్దుగా ‘జంబో’ అని పిలుచుకునే కుంబ్లే ఇండియా జట్టుకు సుదీర్ఘకాలం సేవలందించాడు. అనిల్ కుంబ్లే అక్టోబర్ 17, 1970లో బెంగళూరులో జన్మించాడు. కుంబ్లే టెస్టు కేరీర్ ఆగస్టు9, 1990లో ఇంగ్లాండ్‌తో ప్రారంభమైంది. మొదటి వన్డే మ్యాచ్ అదే ఏడాది శ్రీలంకపై ఆడాడు. రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్ అయిన కుంబ్లే ఇండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టిన కుంబ్లే, జిమ్ లేకర్ తర్వాత పది వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. అది కూడా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై కావడంతో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. తన టెస్టు కేరీర్‌లో కుంబ్లే 132 మ్యాచ్‌లాడి 29.6 సగటుతో 619 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో 271 మ్యాచ్‌లకు ప్రాతినిథ్యం వహించిన కుంబ్లే 30.9 సగటుతో 337 వికెట్లు పడగొట్టాడు. జంబో తన చివరి వన్డే మ్యాచ్ 2007లో బెర్ముడాతో ఆడగా, చివరి టెస్టు మ్యాచ్ ఆస్ట్రేలియాతో 2008 అక్టోబర్‌లో ఆడాడు. ఇండియా తరఫున టెస్టుల్లో, వన్డేల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ కుంబ్లేనే కావడం విశేషం.

కుంబ్లే పుట్టిన రోజు సందర్భంగా పలువురు క్రికెటర్లు, సెలెబ్రిటీలు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. కుంబ్లే ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో కూడా చోటు దక్కించుకున్న విషయం విదితమే. కుంబ్లే విరామమనంతరం టీమిండియా కోచ్ గా, వ్యాఖ్యాతగా, ఐసీసీలో పలు కీలక పదవులు చేపట్టాడు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *