Breaking News
Home / Film News / జంతువులు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నాయి.. ప్రీతి ట్వీట్

జంతువులు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నాయి.. ప్రీతి ట్వీట్

ఏదైనా తప్పు చేస్తే అడ్డగాడిదనో.. దున్నపోతనో తిడుతుంటారు. జంతువులతో పోల్చి తిట్టడం మనుషులకు అలవాటు. కానీ ట్రాఫిక్ రూల్స్‌ను ఇష్టమొచ్చినట్టుగా అతిక్రమిస్తూ.. అంతా నా ఇష్టం అన్నట్టుగా కొంతమంది వ్యవహరిస్తుంటారు. ఇదిగో అలాంటి వారందరికీ లాగి పెట్టి చెంపదెబ్బ కొట్టినట్టుగా సమాధానమిస్తోంది ఓ ఆవు. రెడ్ సిగ్నల్ పడగా.. సరిగ్గా జీబ్రా క్రాసింగ్ దగ్గర ఆగి.. సిగ్నల్ పడేంత వరకు వేచి చూసి వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ప్రముఖ సినీ నటి ప్రీతి జింటా వీడియోను షేర్ చేయగా.. నెటిజన్లు మరింత వైరల్ చేస్తున్నారు. ‘‘జనం సంగతి పక్కన పెడితే.. చివరికి జంతువులు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నాయి. నమ్మడం లేదా.. అయితే చూండండి’’ అంటూ ప్రీతి ట్వీట్ చేశారు.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *