Breaking News
Home / National / అన్నాహజారే మౌనవ్రతం… మోదీకి లేఖ

అన్నాహజారే మౌనవ్రతం… మోదీకి లేఖ

న్యూఢిల్లీ: ప్రముఖ గాంధీయవాది, సామాజిక కార్యకర్త అన్నా హజారే ఈనెల 20న ‘మౌన దీక్ష’కు దిగనున్నారు. 2012 ఢిల్లీ అత్యాచార, హత్యా బాధితురాలికి సత్వర న్యాయం చేకూర్చాలని ఆయన కోరుతున్నారు. ఈ విషయాన్ని ఓ లేఖ ద్వారా ప్రధాని మోదీకి అన్నాహజారే తెలిపారు దేశంలో మహిళలపై అత్యాచార సంఘటనలు పునరావృతమవుతుండటాన్ని కూడా నిరసిస్తూ ఆయన ఈ దీక్షకు పూనుకుంటున్నారు. ‘దిశ’ అత్యాచార, హత్యా ఘటన సహా ఇటీవల కాలంలో మహిళలపై పలు అత్యాచార ఘటనలు వెలుగుచూసిన నేపథ్యంలో హజారే ‘మౌన దీక్ష’కు దిగనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

‘నిర్భయపై అత్యాచార ఘటన జరిగి ఏడేళ్లయింది. ఈ కేసులో దోషుల నిర్దారణ జరిగి, మరణ శిక్ష ప్రకటించినా ఇంతవరకూ అమలు చేయలేదు. ఆ కారణంగానే ఎన్‌కౌంటర్‌ను (దిశ కేసులో) ప్రజలు స్వాగతిస్తున్నారు’ అని మోదీకి రాసిన లేఖలో హజారే పేర్కొన్నారు. ఇలాంటి కేసుల్లో జాప్యం అనేది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని, అది అరాచకానికి దారితీస్తుందని అన్నారు. అత్యాచారం కేసులో చివరిసారిగా 2005లో పశ్చిమబెంగాల్‌లో ఉరితీత జరిగిందని హజారే తన లేఖలో ప్రస్తావించారు. నిర్భయ, ఇతర అత్యాచార బాధితుల కేసుల్లో సత్వర న్యాయం కోసం, తిరిగి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్న డిమాండ్‌పై తాను రాలేగావ్ సిద్ధిలో 20న ‘మౌన వ్రతం’ చేపడుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలకు కళ్లెం వేయడంలో ప్రభుత్వం విఫలమైతే నిరవధిక నిరాహార దీక్షకు కూడా వెనుకాడనని ప్రధానికి రాసిన లేఖలో హజారే స్పష్టం చేశారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *