Breaking News
Home / Lifestyle / Recipes / అన్నం వడలు తయారీ విధానం మీకోసం….

అన్నం వడలు తయారీ విధానం మీకోసం….

వంటలు:

కావలసిన పదార్థాలు:
అన్నం – 200 గ్రా., మైదా – 50 గ్రా., కార్న్‌ఫ్లోర్‌ – 25 గ్రా., నీరు – 50 మి.లీ., ఆలుగడ్డలు, కారెట్లు – 350 గ్రా., ఉల్లిపాయలు – 50 గ్రా., అల్లం వెల్లుల్లి పేస్టు – 1 టీ స్పూను, గరంమసాల – 1 టీ స్పూను, తరిగిన కొత్తిమీర – 2 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు – రుచికి తగినంత, నూనె వేగించడానికి సరిపడా.

తయారుచేసే విధానం:
ఆలుగడ్డలు, కారెట్లు చిన్న ముక్కలుగా తరిగి ఉడికించి, ఉల్లిపాయల్ని దోరగా వేగించి పక్కనుంచు కోవాలి. అన్నం వండిన తర్వాత, చల్లారనిచ్చి అందులో కూరగాయముక్కల్ని, ఉల్లిపాయల్ని, కొత్తిమీర, ఉప్పు, గరం మసాల, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలపాలి. ఒక పాత్రలో కార్న్‌ఫ్లోర్‌, మైదాలను జారుగా కలుపుకోవాలి. అన్నం మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి, జారులో ముంచి, మరోసారి అన్నంలో పొర్లించి నూనెలో దోరగా వేగించి తీయాలి. వీటిని వేడివేడిగా పుదీనా చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి.

Check Also

సజ్జలతో మంచూరియా

Share this on WhatsAppకావలసిన పదార్థాలు: సజ్జ పిండి – 150 గ్రా., మిర్చి – 10 గ్రా., కొత్తిమీర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *