Breaking News
Home / National / వాట్సాప్ నుంచి మరో అద్భుతమైన ఫీచర్

వాట్సాప్ నుంచి మరో అద్భుతమైన ఫీచర్

న్యూఢిల్లీ: మెసేజింగ్ యాప్ వాట్సాప్ నుంచి త్వరలో మరో అద్భుతమైన ఫీచర్ రాబోతోంది. ప్రస్తుతం ఇది పరీక్షల దశలో ఉంది. ఈ ఫీచర్ కనుక అందుబాటులోకి వస్తే ఇక సున్నితమైన మెసేజ్‌లను పంపే సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. కొంత సమయం తర్వాత వాటంతట అవే డిలీట్ అయిపోతాయి. ఇందుకోసం ‘సెల్ఫ్ డిస్ట్రక్టింగ్’ (స్వీయ విధ్వంసం) మెసేజ్ ఫీచర్‌ను తీసుకొస్తోంది. పబ్లిక్ బీటా వెర్షన్‌లో ఇటీవల ఇది కనిపించింది. ‘బగ్ ఫ్రీ’గా రాబోతున్న ఈ ఫీచర్ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది.

సున్నితమైన మెసేజ్‌లు పంపే సమయంలో ‘డిసప్పియర్డ్’ ఫీచర్‌ను ఎంచుకుని ఎంతసేపటి తర్వాత డిలీట్ కావాలనే ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ సమయం రాగానే మెసేజ్ కనిపించకుండా పోతుంది. ‘డిసప్పియర్డ్’ మార్క్‌తో చేసే చాటింగ్ మొత్తం ఆ తర్వాత నిర్దేశించిన సమయం తర్వాత అదృశ్యమైపోతుంది. ఇందుకోసం యూజర్.. గ్రూప్ ఇన్ఫోలో ‘డిసప్పియర్డ్’ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఇటువంటి ఆప్షన్ ‘టెలిగ్రామ్’లో అందుబాటులో ఉంది. వాట్సాప్ ద్వారా సున్నితమైన విషయాలను పంచుకునే వారికి ఈ ఫీచర్ ఉపయుక్తంగా ఉండే అవకాశం ఉంది. ఈ ఫీచర్ గురించి వాట్సాప్ ఇప్పటి వరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయనప్పటికీ కొందరు యూజర్లు మాత్రం ఈ ఫీచర్‌ గురించి వెల్లడించారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *