న్యూఢిల్లీ: రిలయన్స్ జియో నుంచి మరో అద్భుతమైన ఆఫర్ వచ్చేసింది. దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని జియో 4జీ ఫీచర్ ఫోన్‌ను రూ.699కే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆఫర్‌తో జియో ఖాతాదారుల సంఖ్య 50 కోట్లకు చేరుకుంటుందని భావిస్తున్నారు. జియోఫోన్ ధర ప్రస్తుతం రూ.1500 ఉండగా, ఏకంగా రూ.800 తగ్గించి రూ.699కే అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం.
పాత మొబైల్‌ను ఎక్స్చేంజ్ వంటి షరతులు లేకుండానే ఫ్లాట్‌గా రూ.800 తగ్గించినట్టు జియో పేర్కొంది. ఫోన్‌తోపాటు తొలి ఏడు రీచార్జ్‌లతో మొత్తంగా రూ.700 విలువైన డేటా ప్రయోజనాలు లభిస్తాయి. ప్రస్తుతం దేశంలో 35 కోట్ల మంది 2జీ యూజర్లు ఉన్నారు. వారిని 4జీ వైపు మళ్లించడమే లక్ష్యంగా జియో ఈ ఆఫర్‌ను తీసుకొచ్చినట్టు తెలుస్తోంది.