Breaking News
Home / National / సామాన్యుడిపై మరో భారం

సామాన్యుడిపై మరో భారం

న్యూఢిల్లీ : సామాన్యుడిపై మరో భారం పడబోతున్నట్లు తెలుస్తోంది. రైలు ప్రయాణం మరింత ఖరీదు కాబోతోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రైల్వేలలోని వివిధ అంశాలను పరిశీలిస్తున్నట్లు, టిక్కెట్ రేట్ల పెంపు గురించి ఆలోచిస్తున్నట్లు చెప్పాయి.

భారతీయ రైల్వేల ఆదాయం బాగా తగ్గినట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) 2017-18 సంవత్సరానికి సమర్పించిన నివేదిక పేర్కొంది. రైల్వేలు రూ.100 సంపాదించడానికి రూ.98.44 ఖర్చు చేస్తున్నట్లు తెలిపింది. గత పదేళ్ళలో అత్యంత దయనీయంగా రైల్వేల ఆదాయం ఉందని తెలిపింది. ప్యాసింజర్ సర్వీసులు, కోచింగ్ సర్వీసుల నిర్వహణ కోసం సరకు రవాణా వల్ల వచ్చే ఆదాయంలో 95 శాతం ఖర్చు చేస్తోందని పేర్కొంది. వివిధ వర్గాలకు ఇస్తున్న రాయితీలు రైల్వేలకు పెను భారంగా మారినట్లు వివరించింది.

ఈ నేపథ్యంలో రైలు టిక్కెట్ రేట్లను 5 నుంచి 10 శాతం పెంచే అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్ళకు ఈ పెంపును వర్తింపజేసే అవకాశం ఉంది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *