Breaking News
Home / Sports / భారత క్రికెట్ చరిత్రలో మరో అధ్యాయం..

భారత క్రికెట్ చరిత్రలో మరో అధ్యాయం..

కోల్‌కతా: రంజీ ట్రోఫీ రౌండ్-9 ప్లేట్ గ్రూపులో భాగంగా మణిపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో చండీగఢ్ జట్టు రికార్డు సృష్టించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 609 పరుగులు ఆధిక్యం సాధించింది. భారత క్రికెట్ చరిత్రలో ఇది నాలుగో అత్యధిక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంగా రికార్డులకెక్కింది. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో మణిపూర్ జట్టు 63 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన చండీగఢ్ తొలి ఇన్నింగ్స్‌ను 672/8 వద్ద డిక్లేర్ చేసింది. బిపుల్ శర్మ, గురీందర్ సింగ్‌లు ద్విశతకాలతో అదరగొట్టారు. కీపర్ ఉదయ్ కౌల్ 148 పరుగులు సాధించాడు. భారత ఫస్ట్ క్లాస్ క్రికెట్‌ చరిత్రలో ఇప్పటి వరకు 3 అత్యధిక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం రికార్డులు ఉన్నాయి.

1945-46 సీజన్‌లో హోల్కర్-మైసూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో హోల్కర్ జట్టు 722 పరుగుల ఆధిక్యం నమోదు చేసింది. ఆ తర్వాత 1993-94 సీజన్‌లో హైదరాబాద్‌-ఆంధ్ర జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 681 పరుగుల ఆధిక్యం సాధించింది. 2014-15 సీజన్‌లో కర్ణాటక-తమిళనాడు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కర్ణాటక 628 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించింది. తాజాగా, చండీగఢ్ 609 పరుగుల ఆధిక్యం సాధించి ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది.

Check Also

భారత్‌–ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌పై లయన్‌ వ్యాఖ్య

Share this on WhatsAppసిడ్నీ: విరాట్‌ కోహ్లి నాయకత్వంలో టీమిండియా ఆస్ట్రేలియా గడ్డపై 2018–19 టెస్టు సిరీస్‌ను 2–1తో సొంతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *