Breaking News
Home / social media / వాట్సప్ యూజర్లకు మరో గుడ్ న్యూస్…..

వాట్సప్ యూజర్లకు మరో గుడ్ న్యూస్…..

వాట్సప్ కొద్ది రోజుల క్రితమే ఫింగర్ ప్రింట్ అన్‌లాక్ ఫీచర్ రిలీజ్ చేసింది. ఇప్పుడు మరో కొత్త ఫీచర్ ను యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. గ్రూప్ ప్రైవసీ సెట్టింగ్స్ ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లకు రోల్ అవుట్ చేస్తోంది. ఈ ఫీచర్ వచ్చిందంటే… ఇక మీకు వాట్సప్ గ్రూప్ సమస్యే ఉండదు. అంటే మిమ్మల్ని ఎవరు గ్రూప్ లో యాడ్ చేయాలో మీరే నిర్ణయించవచ్చు. మిమ్మల్ని గ్రూప్స్ లో ఎవరు యాడ్ చేయకూడదో మీరే నిర్ణయించవచ్చు. వాట్సప్ గ్రూప్ లో సెట్టింగ్స్ ఎలా చేయాలో తెలుసుకుందాం.

వాట్సప్ లో సెట్టింగ్స్ ఓపెన్ చేసి అకౌంట్ ఓపెన్ చేయాలి.

అకౌంట్ లో ప్రైవసీ ఓపెన్ చేసి గ్రూప్స్ క్లిక్ చేయాలి. మీరు everyone సెలెక్ట్ చేస్తే మిమ్మల్ని ఎవరైన గ్రూప్స్ లో యాడ్ చేయొచ్చు.

my contacts సెలెక్ట్ చేస్తే కేవలం మీ కాంటాక్ట్స్ లో ఉన్నవారే గ్రూప్స్ లో యాడ్ చేసే అవకాశం ఉంటుంది.

my contacts except సెలెక్ట్ చేస్తే ఎవరు మిమ్మల్ని గ్రూప్స్ లో యాడ్ చేయకూడదో వారి కాంటాక్ట్స్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది.

అదే మీరు nobody అని సెలెక్ట్ చేస్తే… మిమ్మల్ని ఎవరూ గ్రూప్స్ లో యాడ్ చేయలేరు. ఈ ఫీచర్ యూజర్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

Check Also

ఫుడ్ డెలివరీ యాప్ : నాలుగు నిమిషాల్లో నాలుగు లక్షలు మాయం

Share this on WhatsAppలక్నో: ఈ మధ్య కాలంలో ఫుడ్ డెలివరీ యాప్‌తో కస్టమర్లు చాలా కోల్పోతున్నారు. తాము చేసిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *