Breaking News
Home / National / కరోనాతో మరో హెడ్ కానిస్టేబుల్ మృతి…

కరోనాతో మరో హెడ్ కానిస్టేబుల్ మృతి…

ముంబై: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కోవిడ్-19 కట్టడి చర్యల్లో భాగంగా లాక్ డౌన్ నిబంధనలను ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తోంది. అయినప్పటికీ మహారాష్ట్రలో రోజురోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ముంబైలో కరోనా వల్ల హెడ్ కానిస్టేబుల్ మృతి చెందినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. పశ్చిమ ముంబైలోని పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించే హెడ్ కానిస్టేబుల్ కోవిడ్-19తో శుక్రవారం చనిపోయారని అధికారులు తెలిపారు. ముంబైలో 15 మంది పోలీసులు చనిపోగా.. మహారాష్ట్రవ్యాప్తంగా 25 మంది పోలీసులు మృతి చెందినట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

Check Also

త్వరలో ఇంటి సహాయకులు, ఆటోవాలాలు, రోజువారీ కూలీలకు కరోనా పరీక్షలు

Share this on WhatsAppదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతోంది. ఢిల్లీలో పరిస్థితి దయనీయంగా మారింది. ఈ నేపధ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *