ఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై రోజుకో నేత సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. సరైన నాయకత్వం లేకపోవడమే తమ పార్టీ ఎదుర్కొంటోన్న పెద్ద సమస్యంటూ ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షిద్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జ్యోతిరాదిత్య సింధియా కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. సల్మాన్ ఖుర్షిద్ చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని సింధియాను కోరగా అందుకు ఆయన నిరాకరించారు.
‘ఒకరి వ్యాఖ్యలపై స్పందించడం నా అలవాటు కాదు. అయితే, కాంగ్రెస్ పార్టీలో సమీక్షించుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయని, పార్టీకి పునరుత్తేజం రావాలంటే ప్రస్తుత పరిస్థితి గురించి చర్చించాల్సిన అవసరం ఉందని, పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలి’ అని సింథియా అన్నారు.