ఫిల్మ్ న్యూస్: తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి మరో ప్రేమకథా చిత్రం సిద్ధమవుతోంది. రవికిరణ్ కోలా దర్శకత్వం వహించిన ఈ సినిమాతో, హీరోగా కిరణ్ .. హీరోయిన్ గా ‘రహస్య’ పరిచయం కానున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. నవంబర్ 29వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
గ్రామీణ నేపథ్యంలో రాజా అనే అబ్బాయి .. రాణి అనే అమ్మాయి చుట్టూ తిరిగే ప్రేమకథ ఇది. రాజా తండ్రి ఆర్ఎమ్పి డాక్టర్ .. రాణి తండ్రి రేషన్ డీలర్ .. ఇక మరో ముఖ్యమైన పాత్రకి తండ్రి ప్రెసిడెంట్. ఇలా పూర్తి గ్రామీణ నేపథ్యంలో ఈ ప్రేమకథ సాగుతుంది. సురేశ్ ప్రొడక్షన్స్ వారు విడుదల చేసే ఈ సినిమా, ఏ స్థాయిలో ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.