Breaking News
Home / Lifestyle / Business / శామ్‌సంగ్‌లో మరో నూతన ఫోల్డింగ్ ఫోన్‌….

శామ్‌సంగ్‌లో మరో నూతన ఫోల్డింగ్ ఫోన్‌….

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: శామ్‌సంగ్‌ గెలాక్సీపోల్డ్‌ పేరుతో మడతబెట్టే ఫోనును మార్కెట్లోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. హువావే, మోటరోలా కూడా త్వరలో మడతబెట్టే ఫోన్లను తీసుకురానున్నట్లు ప్రకటించాయి. వాటికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్‌ మీడియాలో చిందులేస్తున్నాయి. ఇదిలా వుండగా శామ్‌సంగ్‌ మరో నూతన మోడల్‌ మడతబెట్టే ఫోనును విడుదల చేస్తున్నట్లు అమెరికాలో జరుగుతున్న శామ్‌సంగ్‌ డెవలపర్స్‌ సదస్సులో కంపెనీ ఈ ప్రకటన చేసింది. ఇంతక ముందు వచ్చిన గెలాక్సీ ఫోడ్డ్‌ మోడల్‌కు ఇది భిన్నంగా ఉంటుంది. అయితే గతంలో వచ్చిన ఫోనును అడ్డంగా మడతపెట్టవచ్చు. పూర్తిగా తెరిచినప్పుడు ట్యాబ్‌లాగా వాడుకోవచ్చు. కానీ ఇప్పుడు విడుదలచేయబోయే నూతన మోడల్‌ పొడవాటి డిసిప్లే నిలువుగా మడతబెట్డే విధంగా తయారు చేస్తున్నట్లు శామ్‌సంగ్‌ కంపేని తెలిపింది. దీనిని మడతబెట్టినప్పుడు చేతిలో ఒదిగిపోయేలా తెరిచినప్పుడు పొడవాటి డిసిప్లేతో ఆకర్షించేలా వుంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు విడుదలచేయలేదు. మోడల్‌నెంబర్‌ ఎస్‌ఎం-ఎఫ్‌700ఎఫ్‌గా పిలిచే ఈ ఫోన్‌ 256జీబీ అంతర్గత సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని తెలుస్తుంది.

Check Also

వరుడు ఒక్కడే.. కానీ వధువులిద్దరు

Share this on WhatsAppమధ్యప్రదేశ్‌: మధ్యప్రదేశ్ కు చెందిన సందీప్ బంపర్ ఆఫర్ కొట్టేశాడు. ప్రేమించిన పిల్ల, పెద్దలు చూసిన పిల్ల.. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *