Breaking News
Home / Crime / ఈఎస్‌ఐ కుంభకోణం కేసులో మరో కొత్త కోణం

ఈఎస్‌ఐ కుంభకోణం కేసులో మరో కొత్త కోణం

హైదరాబాద్‌: తెలంగాణలో సంచలనం సృష్టించిన కార్మిక వైద్య బీమా సేవల సంస్థ (ఈఎస్‌ఐ) మందుల కొనుగోలు కుంభకోణంలో రోజుకో కొత్త కోణం బయటపడుతోంది. ఆ విభాగం అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది, కొందరు ప్రైవేట్‌ వ్యక్తులు కలిసి భారీగా అవినీతికి పాల్పడినట్లు అనిశా అధికారులు గుర్తించారు. ఏడాదికి రూ.250 కోట్లు చొప్పున నాలుగేళ్లలో దాదాపు రూ. వెయ్యి కోట్ల మేర ఔషధాల కొనుగోళ్లు జరిగినట్లు అధికారుల విచారణలో తేలింది. దర్యాప్తును వేగవంతం చేసిన అధికారులు.. ఈ కుంభకోణానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 70 డిస్పెన్సరీల నుంచి వివరాలు సేకరించారు.

ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 8 మంది నిందితులను అరెస్టు చేశారు. మరికొంత మంది అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు మెడికల్‌ ఏజెన్సీల కార్యాలయాల్లో అనిశా అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి పలువురు ఈఎస్‌ఐ ఉద్యోగుల సంతకాలను సైతం సేకరించారు. మరో రెండు రోజుల్లో ఈ కేసుకు సంబంధించి మరికొంత మందిని అనిశా అధికారులు అరెస్టు చేసే అవకాశం ఉంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *