Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / హైకోర్టులో ఏపీ సర్కార్‌కు మరో షాక్…

హైకోర్టులో ఏపీ సర్కార్‌కు మరో షాక్…

అమరావతి: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. పంచాయతీ కార్యాలయలకు రంగులపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 623 జీవోను హైకోర్టు రద్దు చేసింది. సుప్రీం, హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా జీవో ఎందుకు ఇచ్చారో వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.

రాష్ట్రంలో పంచాయతీ కార్యాలయాలకు రంగులు వేయడంపై రాష్ట్ర హైకోర్టు ఈరోజు తీర్పును వెలువరించింది. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు 623జీవోను కొట్టివేసింది. సుప్రీం కోర్టు, హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా పంచాయతీ కార్యాలయలకు రంగుల వేయడం కోసం మరో జీవో ఇవ్వడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర పంచయతీ రాజ్ సెక్రెటరీతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా కోర్టు ధిక్కరణ ప్రక్రియను కూడా ప్రారంభించాలని రిజిస్ట్రార్‌‌ను కోర్టు ఆదేశించింది. ఈనెల 28లోపు రంగులకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో కోర్టు ధిక్కరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని హైకోర్టు పేర్కొందని…. 623జీవోను సవాల్‌ చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం చేసిన చింతలపాటి సోమయాజులు తెలిపారు.

Check Also

ఏపీ సచివాలయంలో కరోనా కలకలం…

Share this on WhatsAppఅమరావతి: సచివాలయంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సుల్లో వచ్చిన ఒక ఉద్యోగికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *