హైదరాబాద్: ఓవైపు హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో సత్తా చాటాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తుంటే ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరూ జారిపోయి షాకిస్తున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవేందర్‌గౌడ్ తనయుడు వీరేందర్‌గౌడ్ భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. ఢిల్లీలో ఈరోజు బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జె.పి.నడ్డా సమక్షంలో ఆయన బీజేపీలోకి చేరుతున్నట్లు ప్రకటించారు. రాజకీయ అవసరాల కోసం టీడీపీ సిద్ధాంతాలకు భిన్నంగా పనిచేస్తోందని ధ్వజమెత్తారు.
