Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / టీడీపీకి మరో షాక్….

టీడీపీకి మరో షాక్….

అమరావతి : ఏపీ ఎస్సీ, ఎస్టీ, కమిషన్‌ మాజీ చైర్మన్‌ కారెం శివాజీ వైసీపీలో చేరనున్నారు. సాయంత్రం 4 గంటలకు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. కాగా..కారెం శివాజీతోపాటు ఆయన సన్నిహితులు కూడా వైసీపీలో చేరనున్నారు.

చంద్రబాబు సీఎంగా ఉన్న హాయంలో కారెం శివాజీ ఏపీ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ గా నియమితులు కావటంతో అనంతరం న్యాయపరమైన వివాదాలు వెంటాడాయి. ఆ తరువాత తిరిగి న్యాయ పరంగా పోరాటం కొనసాగిస్తూ..పదవిలో కొనసాగారు. ఈ క్రమంలో ప్రభుత్వం మారింది. జగన్ సీఎం అయ్యారు. ఆ తరువాత కూడా శివాజీ అదే పదవిలో కొనసాగారు. అనంతరం శివాజీ నిన్న తన పదవికి రాజీనామా చేసారు. వైసీపీలో చేరాలనే ఉద్ధేశ్యంతోనే కారెం రాజీనామా చేసినట్లుగా సమాచారం.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *