Breaking News
Home / National / రూ.2 వేల నోట్ల గురించి మరో షాకింగ్ న్యూస్..!

రూ.2 వేల నోట్ల గురించి మరో షాకింగ్ న్యూస్..!

అవినీతి, నకిలీ కరెన్సీ దందా, నల్లధనం.. ఈ మూడింటికి చెక్ పెట్టేందుకు మోదీ సర్కార్ డీమోనిటైజేషన్ పేరుతో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇక దీని తర్వాత ఎంతో కట్టుదిట్టంగా రూ.2 వేల రూపాయల నోట్లను ముద్రించి చలామణీలోకి తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు వాటి గురించి ఓ సంచలన విషయం బయటికి వచ్చింది. ఆ నోట్లు కాపీ కొట్టేందుకు వీలుగా ఉండటమే కాకుండా.. నకిలీ నోట్లను ఈజీగా రూపొందించేందుకు అనువుగా ఉన్నాయని తేలింది. అంతేకాకుండా దేశంలో హల్చల్ చేస్తున్న ఫేక్ కరెన్సీలో అత్యధిక శాతం రూ.2 వేల నోట్లే ఉండటం గమనార్హం.

ఇటీవల ఎన్‌సీఆర్‌బీ (నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో) అందించిన నివేదిక ప్రకారం మోదీ డీమోనిటైజేషన్ ప్రకటన చేసిన అనంతరం దేశవ్యాప్తంగా పట్టుబడిన నకిలీ నోట్లలో అధిక భాగం రూ.2 వేల నోట్లే ఉన్నాయని వెల్లడించింది. ఈ నోట్లను కేంద్రం చలామణీలోకి తీసుకురాకముందే 56 శాతం పైగా నకిలీ నోట్లు మార్కెట్‌లోకి ప్రవేశించాయని చెబుతోంది. కాగా, 2016 నవంబర్ 8వ తేదీన రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే.

Check Also

జెంషెడ్‌పూర్‌, హంపిలో భూ ప్రకంపం

Share this on WhatsAppదేశంలో ఇవాళ రెండు చోట్ల భూకంపం సంభవించింది. జార్ఖండ్‌, మహారాష్ట్రలో భూ ప్రకంపనలు నమోదు అయ్యాయి. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *