Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / మందు బాబులకు మరో షాకింగ్ న్యూస్.. ఇకపై..

మందు బాబులకు మరో షాకింగ్ న్యూస్.. ఇకపై..

కిక్కెక్కితే.. బుక్కైనట్టే..!
కొత్త మిషన్లు వచ్చేశాయ్‌
ఆల్కహాలు శాతంతో పాటు ఇక ఫొటో కూడా
తప్పక కేసు నమోదు చేయాల్సిందే
నగరవ్యాప్తంగా దాడులు
పదిమందిపై కేసులు
సత్యనారాయణపురం: మద్యం సేవించి వాహనాన్ని నడిపి పోలీసులకు చిక్కిన కొంతమంది పైరవీలు చేసి వేరేవ్యక్తి పేరుతో కేసులు నమోదు చేయించి కోర్టుకు వెళ్లకుండా తప్పించుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. వీటికి చెక్‌పెట్టెందుకు ఇప్పుడు కొత్త బ్రీత్‌ ఎనలైజర్‌లు పోలీసులకు అందుబాటులోకి వచ్చాయి. అందులో ఆల్కహాల్‌ శాతంతో పాటు, వ్యక్తిపోటో, పరీక్ష సమయంలో వీడియో రికార్డింగ్‌ వస్తుంది. దీంతో ఇక మద్యం సేవించి వాహనం నడిపిన వారు పోలీసులకు చిక్కితే కోర్టుకు వెళ్లితీరాల్సిందే. సత్యనారాయణపురం ఫుడ్‌జంక్షన్‌ వద్ద మూడవ ట్రాఫిక్‌ పోలీస్టేషన్‌ సీఐ దుర్గారావు ఆధ్వర్యంలో శనివారం సిబ్బంది కొత్త మిషన్లతో పరీక్షలు నిర్వహించి మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నవారిపై కేసులు నమోదు చేశారు. పలు వాహనాలను సీజ్‌ చేశారు.

599 కేసులు నమోదు : మూడో ట్రాఫిక్‌ సీఐ దుర్గారావు
మూడవ ట్రాఫిక్‌పోలీసు స్టేషన్‌ పరిధిలో ఈ సంవత్సరం మద్యం సేవించి వాహనం నడుపుతున్న 599 మందిపైన కేసులు నమోదు చేశాం. వారిని కోర్టులో హాజరు పరచగా పది మందికి జడ్జి జైలు శిక్షసైతం విధించారు. ఒక్క నవంబరు నెలలోనే 83 మంది మద్యంసేవించి వాహనం నడుపుతూ పట్టుపడ్డారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *