Breaking News
Home / National / వరుస హత్యలతో రెచ్చిపోతున్న దుండగులు…

వరుస హత్యలతో రెచ్చిపోతున్న దుండగులు…

బెంగళూరు: అలయన్స్‌ యూనివర్సిటీ మాజీ కులపతి డాక్టర్‌ అయ్యప్ప దొరె దారుణ హత్య మరువకముందే నగరంలో వృద్ద దంపతుల హత్య సంచలనమైంది. గరుడాచార్య పాళ్య ఆర్‌.హెచ్‌.బి.కాలనీలో నివసించే చంద్రేగౌడ (63), ఆయన భార్య లక్ష్మమ్మ (55)లకు సంతానం లేకపోగా ఇంట్లో వారిరువురే ఉన్నారు. దత్తత కుమార్తె ఉన్నా వివాహం చేసి పంపారు. బుధవారం రాత్రి పొద్దుపోయాక చంద్రేగౌడ ఇంట్లోకి దొంగలు చొరబడే ప్రయత్నం చేయగా ఎంతసేపటికి తలుపులు తెరచుకోకపోవడంతో బద్దలుకొట్టి ఇంట్లోకి ప్రవేశించి దారుణానికి ఒడిగట్టారు. హాలులో చంద్రేగౌడను బెడ్‌రూములో లక్ష్మమ్మను హత్య చేసిన దొంగలు బీరువాల్లోని నగదు, ఆభరణాలు దోచుకెళ్ళారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి డాగ్‌స్క్వాడ్‌ ద్వారా పరిశీలించారు. వైట్‌ఫీల్డ్‌ పోలీసులు కేసు నమోదు చేసినట్లు డిసిపి అనుచేత్‌ వెల్లడించారు. హంతకులను పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశామన్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *